ఐదు సంవత్సరాలుగా రహదారి అధ్వాన్న స్థితికి చేరి ప్రయాణించడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలకు తెరపడింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చొరవతో అవనిగడ్డ - కోడూరు ప్రధాన రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఈ రహదారిలో ప్రమాదాలకు గురై చనిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే చొరవతో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.