నేటి నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోడూరు మండల ఎఫ్డిఓ డి. స్వామిశేఖర రావు ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 15 నుండి జూన్14 వరకు 61 రోజుల పాటు యాంత్రిక ఇంజిన్ నావలతో వేట చేయుట నిషేదించటమైనదన్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప లాండింగ్ సెంటర్ నందు గల మర పడవల యజమానులు, షరతులు ఉల్లంఘించిన ఎడల జరిమానా విధించుటతోపాటు బోటు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.