కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణ, స్వామివారి మూలవిరాట్ కు 108 కలశములతో అభిషేకం నిర్వహించారు. అభిషేకం తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన చేశారు.