కోడూరు: రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

0చూసినవారు
కోడూరు: రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కోడూరు మండల సీఐటీయూ ఇన్చార్జి కార్యదర్శి యక్కటి తాతారావు కోరారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి మర్రపు పోలినాయుడు ఆధ్వర్యంలో శనివారం కోడూరు పంచాయతీ సిబ్బంది ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పోలాబత్తిన మోహన్ రావు, మత్స్య కార్మిక సంఘం నాయకులు కోపనాతి తాతయ్య, మోహనకృష్ణ, నాని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్