కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చు పర్యాటకులు మెరైన్ పోలీస్ వారి సూచనలు తప్పక పాటించాలని మెరైన్ ఎస్ఐ పూర్ణ మాధురి తెలిపారు. ఆదివారం హంసలదీవి సముద్ర తీర ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి విహార యాత్రకు వచ్చిన పర్యాటకులకు పలు సూచనలు అందించారు. సముద్రంలో లోతైన ప్రాంతాలు ఉంటాయని తగు జాగ్రత్తలు పాటించి స్నానాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరైన్ సిబ్బంది పాల్గొన్నారు.