కోడూరు మండలం హంసలదీవి పంచాయతీలో వింత సంఘటన కనిపించింది. లక్షలాది రూపాయలు పెట్టి నిర్మించిన సీసీ రోడ్లకు గేట్లు ఏర్పాటు చేసి ఎవరు వెళ్లకుండా తాళాలు వేయటం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకుండా రహదారులకు అన్ని వైపుల గేట్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గేట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ఉపయోగమంటూ గ్రామసులు ప్రశ్నిస్తున్నారు.