రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఖో - ఖో పోటీలకు కోడూరు మండలం లింగారెడ్డిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగ రత్నకుమారి తెలిపారు. బుధవారం పాఠశాలలో ఆమె మాట్లాడుతూ జగ్గయ్య పేటలో 22న జరిగిన జిల్లా స్థాయిలో అండర్-17 కబడ్డీ విభాగంలో ఒక విద్యార్థి ఎంపిక అయిందన్నారు. గుడివాడలో 20న జరిగిన జిల్లా స్థాయిలో ఖో -ఖో విభాగంలో ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని తెలిపారు