కోడూరు మండలం పాలకాయతిప్ప సముద్ర తీరం పర్యాటక రాకతో కళకళలాడింది. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల నుండి సముద్ర తీరంలో సేద తీరేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసారు. పాఠశాలలకు సెలవులు కావడంతో చిన్నారులతో కుటుంబ సమేతంగా అధిక శాతం పర్యాటకులు వస్తున్నారు. సముద్రపు అలలు, కనువిందు చేసే కెరటాలు, సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం, చూడముచ్చటైన కమనీయ దృశ్యాల కను విందు చేశాయి.