కోడూరు: టోల్ వసూల్ పై పర్యాటకులు అసంతృప్తి

78చూసినవారు
కోడూరు: టోల్ వసూల్ పై పర్యాటకులు అసంతృప్తి
కోడూరు మండలంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హంసలదీవి బీచ్ గేట్ వద్ద అటవీ శాఖ అధికారులు టోల్ వసూలుపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్దలేని టోల్ వసూల్ మారుమూల ఉన్న హంసలదీవి బీచ్ వద్ద ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడైనా టోల్ గేట్ అంటే వాహనాలకు మాత్రమే ఉంటుందని కానీ ఇక్కడ పెద్దలకు 20, పిల్లలకు10 వసూలు చేస్తున్నారని ఇదెక్కడి విడ్డూరమని శుక్రవారం వాపోయారు.

సంబంధిత పోస్ట్