కోడూరు అవుట్ పాల్స్ స్లూయిజ్ పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని రైతులు ఆదివారం కోరారు. అవుట్ పాల్స్ గేట్లు తుప్పు పట్టి విరిగిపోవడంతో కృష్ణానది నుంచి సముద్రపు ఉప్పునీరు నేరుగా పంట పొలాలలోకి చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉప్పునీరు నేరుగా పంట పొలాలలోకి చేరుట కారణంగా ఈ సంవత్సరం నారుమడి దశలోనే రెండుసార్లు మునిగాయని, ఆ తర్వాత నాట్లు వేయగానే మరల మునిగి తీవ్రంగా నష్టపోయామని తెలిపారు.