ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవి మాత అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా గురువారం రాత్రి అమ్మవారి గ్రామోత్సవాన్ని కోడూరు పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక దాన శక్తి ప్రార్థనా మందిరం వద్ద నుండి కోడూరు తూర్పు వైపుకు, అక్కడనుండి గంగానమ్మ గుడి సెంటర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు రథానికి నీళ్లు పోస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాన్సర్లచే అమ్మవారి పాటలకు నృత్యాలు చేశారు.