కూతురు ఆరోగ్యం బాగుండాలని మూడు కిలోమీటర్లు మోకాళ్ళపై పాకుతూ ఓ తల్లి వెంకన్న దర్శనానికి వెళ్ళి తన భక్తి పారవశ్యాన్ని చాటుకుంది. శనివారం కోడూరు శివారు శ్రీరాంపురం గ్రామానికి చెందిన కన్నా మౌనిక తన కూతురు ఆరోగ్యం బాగుండాలని కోరుతూ శ్రీరాంపురంలోని తన నివాసం వద్ద నుంచి కోడూరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు మోకాళ్ళపై పాకుతూ వెళ్లి స్వామిని దర్శించుకుంది.