కోడూరులో వివాహిత అదృశ్యం

68చూసినవారు
కోడూరులో వివాహిత అదృశ్యం
కోడూరులో వివాహిత అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కోడూరు ఎస్సై పి. శిరీష తెలిపిన వివరాల ప్రకారం కోడూరు గ్రామానికి చెందిన పరిసే శ్రావణి ఈనెల ఎనిమిదవ తేదీన ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నం బస్సు ఎక్కి వెళ్ళినట్లుగా సమాచారం తెలిసిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్