మాజీ మంత్రి మృతికి ఎమ్మెల్యే సంతాపం

50చూసినవారు
మాజీ మంత్రి మృతికి ఎమ్మెల్యే సంతాపం
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మరణ వార్త నన్నెంతో బాధించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తపరిచారు. వారితో నాది ఆత్మీయానుబంధమని, రాజకీయాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కృష్ణాజిల్లా ఇంచార్జి మంత్రిగా జిల్లా అభివృద్దికి దోహదపడ్డారని, వారి మరణంతో ఒక హితైషిని కోల్పోయానన్నారు. ఆత్మశాంతి కలగాలని భగవానుని ప్రార్దిస్తున్నట్టు పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్