ఆపరేషన్ సింధూర్ ఘన విజయం దేశానికి గర్వకారణం అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం మోపిదేవిలో మండల పరిషత్ కార్యాలయం పర్యవేక్షణలో ఎంపీపీ రావి దుర్గావాణి ఆధ్వర్యంలో భారతదేశ త్రివిధ దళాల పోరాట పటిమ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోపిదేవి పురవీధుల్లో తిరంగా ర్యాలీ కార్యక్రమం జరిగింది. మోపిదేవి సెంటర్ నుంచి బస్టాండ్ వరకు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు.