మోపిదేవి మండలం పెదప్రోలులో రేపు జరిగే అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సెక్రటరీ కూరపాటి కోటేశ్వరావు తెలిపారు. గురువారం నాంచారమ్మ తల్లి దేవాలయములో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రేపు జరిగే జాతర మహోత్సవంలో సినీ గాయని శ్రావణ భార్గవిచే మ్యూజికల్ నైట్ తో పాటు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.