మహనీయుల ఆదర్శాలతో క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కం కళాశాలలో జోనల్ స్థాయి ఆటల పోటీలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.