మోపిదేవి: బైక్ ను ఢీ కొట్టిన బస్సు - యువకుడికి గాయాలు

65చూసినవారు
మోపిదేవి: బైక్ ను ఢీ కొట్టిన బస్సు - యువకుడికి గాయాలు
మోపిదేవి మండలం పెదప్రోలు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి నుంచి బైక్ పై వస్తున్న యువకుడిని మోపిదేవి పైపు నుంచి వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చల్లపల్లి మండలం కొత్త మాజేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. యువకుడిని 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్