గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి తెలిపారు. మంగళవారం సాయంత్రం మోపిదేవి తహసిల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆమె రికార్డులు తనిఖీ చేశారు. రెండో విడతగా 124 ఎకరాలకు సంబంధించే రీ సర్వేపై వచ్చిన సమస్యలు పరిష్కార నిమిత్తం రైతుల అభిప్రాయాలు తీసుకుని వాటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. నీటి తీరువా వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు.