కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని జిల్లా జడ్జి గుత్తల గోపి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి స్వర్ణలత, పాండురంగ రెడ్డి తొలుత నాగపుట్టలో పాలు పోశారు. వీరికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను ఆలయ సూపర్డెంట్ బొప్పన సత్యనారాయణ, సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేసారు.