ప్రపంచ జినోసిస్ డే సందర్భంగా మండల కేంద్రమైన మోపిదేవి పశు వైద్యశాల నందు ఆదివారం 50 పెంపుడు కుక్కలకు ఉచిత రాబిస్ వ్యాక్సిన్ వేశారు. ప్రతి సంవత్సరం జులై ఆరో తేదీన ఈ జూనోసిస్ డే జరుపుకుంటారని, ఉచితంగా పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వం అందిస్తుంది. దీనిలో భాగంగా మోపిదేవి పశువైద్యశాల నందు డాక్టర్ ఎం. నందకిషోర్ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ అందించారు.