మోపిదేవి: జనసేనానిపై మది నిండా అభిమానం

80చూసినవారు
మోపిదేవి: జనసేనానిపై మది నిండా అభిమానం
జనసేనానిపై మది నిండా అభిమానం నింపుకున్న జనసైనికుడు తన వివాహ పత్రికలోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించుకున్నాడు. మోపిదేవి మండలం మెరకనపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మెరకనపల్లి నవీన్ వివాహ రిసెప్షన్ శనివారం తన స్వగ్రామంలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ బాలసౌరి ఫోటోలతో ఆహ్వాన పత్రిక ముద్రించారు.

సంబంధిత పోస్ట్