తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సిపిఎం సీనియర్ నాయకులు వాకా రామచంద్రరావు డిమాండ్ చేశారు. శనివారం మోపిదేవిలో ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుందని, వాస్తవ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు