మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్ట్ జడ్జి

155చూసినవారు
మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ జడ్జి కె. శ్రీనివాస్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హైకోర్ట్ జడ్జికి  కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీనివాస్ రెడ్డి నాగపుట్టలో పాలు పోశారు.

సంబంధిత పోస్ట్