మోపిదేవి మండల పరిధిలోని, అమోద్య, పెద్దకళ్ళేపల్లి, చిరువోలంక, పెదప్రోల్లు, కొక్కిలగడ్డ తదితర ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా యధేచ్చగా మట్టి అక్రమ రవాణాకు జరుగుతుంది. మట్టి అక్రమ రవాణా రెవెన్యూ శాఖ అధికారులు కన్నుసన్నల్లోనే సాగిపోతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శనివారం రాత్రి భారీగా ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.