దేవాలయాల పరిరక్షణకై చేపట్టిన హైందవ శంఖారావం సభకు తరలి రావాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బూరగడ్డ శ్రీనాథ్ కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన మోపిదేవి విచేసి దుకాణదారులకు కరపత్రాలు అందించి హైందవ శంఖారావం సభకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలు, హిందూ ధర్మ పరిరక్షణకై లక్షలాదిగా ఈనెల 5వ తేదీన జరిగే సభకు తరలి రావాలన్నారు.