లారీ బైక్ ను ఢీ కొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలను సంఘటన మోపిదేవి మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. మండల పరిధిలోని కుక్కలు గడ్డ గ్రామానికి చెందిన శివ తేజస్, నాగ జస్వంత్ లు ద్విచక్ర వాహనంపై మోపిదేవి వస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో మచిలీపట్నం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.