మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాల ధరించిన భక్తులు బుధవారం స్వామివారికి పాల కావిడిలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.