అక్రమ కలప రవాణా కేంద్రంగా మోపిదేవి మండల పరిధిలో మోపిదేవి వార్పు తయారైంది. రెవెన్యూ, ఫారెస్ట్, ఇతర శాఖల అధికారులకు తెలియజేసినా చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. వోల్టా యాక్ట్ చట్టాలు అమలు చేయవలసిన అధికారులు ఇలా మౌనంగా ఉండటంతో విచ్చల విడిగా చెట్లు నరికి బయటకు లారీల్లో తరలిస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు. ఈ అక్రమ కలప రవాణాకు అధికారులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.