మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారి కల్యాణ నిర్వహించగా, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉంచి మంగళవారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాదిమంది భక్తజనులు ముందుగా నడుస్తుండగా స్వామివారి రథం గ్రామ పురవీధుల్లో ముందుకు కదిలింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.