జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ బాలాజీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నాగ పుట్ట వద్ద పాలు పోసి, నాగపుట్ట పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.