మోపిదేవి: వైభవోపేతంగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం

51చూసినవారు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ మంగళ సూత్రాలను భక్తులకు చూపిస్తూ కళ్యాణ క్రతువును నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, డిఎస్పి విద్య శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్