మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటికిటలాడింది. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రత్యేక వాహనాల్లో స్వామివారి దర్శనానికి విచ్చేశారు. తొలుత నాగవల్లి వృక్షం వద్ద మొక్కుబడులు చెల్లించుకుని నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో వరప్రసాదరావు పర్యవేక్షించారు.