మోపిదేవి మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీ విద్య పేర్కొన్నారు. గురువారం మోపిదేవిలోని తహసిల్దార్ వారి కార్యాలయం నందు కోడిపందాలు, జూదము వంటి అసాంఘిక కార్యక్రమాలు అరికట్టుటపై సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండగ సందర్భంగా మండల పరిధిలో కోడిపందాలు వేయకూడదని, ఎక్కడబడితే అక్కడ లిక్కర్స్ అమ్మకుండా చూడాలన్నారు. గ్రామస్థాయి కమిటీలు గ్రామాల్లో నిఘా ఉంచాలన్నారు.