నాగాయలంక మండలం దిండి గ్రామం నుండి నాగాయలంక బుసక మట్టి సోమవారం రాత్రి అక్రమంగా తరలించారు. రెవిన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. రాత్రిపూట నాగాయలంక పరిసర గ్రామాలలో ఓవర్ లోడ్ వేసుకుని ఓవర్ స్పీడ్ తో వెళ్తుంటే గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేమిటని ప్రజలు అడిగితే వాళ్ల మీద తిరగబడుతున్నారని వాపోతున్నారు.