నాగాయలంక మండలంలోని ఏటిమొగ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం నాగాయలంక ఎస్ఐ కె. రాజేష్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ప్రత్యక్షంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 3,350 నగదు స్వాధీనం చేసుకుని వారందరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.