నాగాయలంక గ్రామపంచాయతీలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి వేమవరపు సీతారామయ్య మంగళవారం సందర్శించారు. కేంద్రం నుంచి ఏయే ఉత్పత్తులను తయారీ చేస్తున్నారో కార్యదర్శి జె. పవన్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపుగా మండలములోని అన్ని గ్రామపంచాయతీల్లో వున్న సంపద కేంద్రాల షెడ్లను ఫంక్షనింగ్ లోకి తీసుకొని రావాల్సిందని ఈఓపీఆర్డీ నరసమ్మను డీఎల్పీఓ ఆదేశించారు