నాగాయలంక: జాతీయ క్రీడలలో సత్తాచాటిన బాలిక

50చూసినవారు
నాగాయలంక: జాతీయ క్రీడలలో సత్తాచాటిన బాలిక
జాతీయ క్రీడలలో నాగాయలంక బాలిక నాగిడి గాయత్రి సత్తాచాటింది. ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడలలో కృష్ణా జిల్లా మారుమూల ప్రాంతమైన నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి కేనోయింగ్ పోటీలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. బంగారు పతకం కైవసం చేసుకుని ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపించింది. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అందిన సహాయ సహకారాలు వల్ల తాను విజయం సాధించగలిగానని గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్