నాగాయలంకలో జెడ్పీ పాఠశాలలో 1977 - 78 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ కుశల ప్రశ్నలతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీహరి ప్రసాద్ పాల్గొన్నారు