అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం నాగాయలంక పార్కు వద్ద ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తానoకి పోతురాజు, కనగాల యోహాన్, అబ్రహం, కైతేపల్లి నీలమేఘం, గాజులేటి మధుబాబు, బందెల అశోక్ తదితరులు పాల్గొన్నారు.