కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన క్రీడాకారిణి గాయత్రీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ కాన్ స్లాలోమ్ మహిళా విభాగంలో గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గోల్డ్ మెడల్ సాధించడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.