నాగాయలంక: 50 వేల నాణెములతో స్వామివారి అలంకరణ

70చూసినవారు
నాగాయలంక: 50 వేల నాణెములతో స్వామివారి అలంకరణ
కార్తీక మాసం సందర్భంగా నాగాయలంక శ్రీరామపాద క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయంలోని నందీశ్వరునికి పాలాభిషేకాలు, శివలింగాన్ని 50వేలు విలువగల 10, 5 రూపాయల నాణేలతో అలంకరణ చేశారు. భక్తులు విరివిగా విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఛైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పల లీలాకృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్