నాగాయలంక మండలంలోని నంగేగడ్డ గ్రామంలో టీడీపీ జెండా దిమ్మ చెంతన దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ఆదివారం మండల టీడీపీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు తాడేపల్లి వెంకట పాపారావు, అమ్ముల సుబ్బారావు, మిరియాల రామాంజనేయులు, ఈవూరి నాగార్జున, చిరివేళ్ల నాగరాజు, ఉప్పల ప్రసాద్, ముప్పరాజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.