ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి సందర్భంగా నాగాయలంక శ్రీరామపాద క్షేత్రంలోని పుష్కరఘాట్ లో పుణ్య స్నానాలు చేసి శ్రీకనకదుర్గమ్మ అమ్మ వారిని భక్తులు దర్శించుకున్నారు. నాగాయలంకలోని శ్రీ పోతురాజు స్వామి, సబ్బినేని వారి శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆలయాల నుంచి వందలాది భక్తులు ఆషాఢ సారెలను పళ్లాలతో పట్టుకుని మేళ తాళాలతో పురవీథులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకనకదుర్గమ్మ అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.