నాగాయలంక మండలం వక్కపట్ల వారిపాలెం పరిధిలో అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిలోని ఓ ప్రయివేటు స్థలంలో కోడి పందాలను నిర్వహించేందుకు నిర్వాహకులు శనివారం జేసీబీతో ఆ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ కె. రాజేష్, డీటీ అబ్దుల్ రఫీ రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి ఆ వాహనాన్ని నిలుపుదల చేశారు. వాహనం యజమానిని హెచ్చరించి అక్కడ నుండి పంపించి వేశారు.