నాగాయలంక తహశీల్దార్ కార్యాలయంలో పై అంతస్తు భవనంలో వరండా శ్లాబ్ ఈశాన్యదిశలో ఒక పక్క ఊడిపోతూ సిబ్బందిని భయాందోళనకు గురి చేస్తుంది. మండల తహశీల్దార్ కార్యాలయం 2004లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. రెండు దశాబ్దాల తరువాత భవనం అంతస్తులోని పై కొంత భాగం ఊడుతూ అచ్చులుగా కింద పడుతోంది. అసలే ఇరుకుగా ఉన్న ఈ కార్యాలయంలో సిబ్బంది వరండాలో కూర్చొని విధులను నిర్వహిస్తుంటారు.