నాగాయలంక: నవలంకకు తరలివస్తున్న సందర్శకులు

54చూసినవారు
నాగాయలంక: నవలంకకు తరలివస్తున్న సందర్శకులు
బడులకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలతో కలసి తల్లిదండ్రులు నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ని, నది మధ్యలో ఉన్న నవలంకను పడవలో వెళ్లి సందర్శించి ప్రకృతి అందాలను వీక్షించి అమితానందాన్ని పొందుతున్నారు. నవలంకలో ఉన్న బెంచీల మీద తల్లిదండ్రులు కూర్చోగా, పిల్లలు ఇసుక తిన్నెలలో పిచ్చుక గూడులను కట్టుకుంటూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. పిల్లలు ఘాట్లో స్నానాలు చేస్తూ వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్