ఘంటసాల మండలంలోని మూడు గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు కావటంతో విద్యార్థులు ఉత్సాహం ఈ శిబిరాల్లో పాల్గొంటున్నారు. శనివారం కొడాలి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక పఠనం అనంతరం గోనె సంచులతో ఆటల పోటీలు, స్కిప్పింగ్, చెస్ వంటి పోటీలు నిర్వహించారు. ఘంటసాల గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక పఠనం, కథలు చెప్పించటం, కథలు రాయించటం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.