అక్రమ మద్యం బాటిళ్లు పట్టుకున్న పోలీసులు

71చూసినవారు
అక్రమ మద్యం బాటిళ్లు పట్టుకున్న పోలీసులు
అక్రమ మద్యం బాటిళ్లను నాగాయలంక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నాగాయలంక ఎస్సై కె. రాజేష్ తెలిపిన కథనం ప్రకారం అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన మాదివాడ సుబ్బారావు స్థానిక స్వప్న థియేటర్ వద్ద తాను నడుపుతున్న షాపులో అక్రమంగా మద్యం బాటిళ్లు ఉంచాడు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో అక్కడికి వెళ్లి సుబ్బారావు వద్ద నుండి 14 మద్యం బాటిళ్లు పట్టుకుని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్