చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ బుధవారం కలిశారు. లక్ష్మీపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో రహదారులు అద్వాన్నంగా ఉండటం వలన సిసి రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిధుల మంజూరు చేయించాలని కోరారు అందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు.